పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0075-5 ఆహిరి సం: 05-263

పల్లవి:

ఏందాఁకా జాగిది యేలే- తన-
అందములచటనె అయ్యీఁగాక

చ. 1:

మృగమదమీతఁడు మెత్తీనిదె మై
ధగధగమనఁగాఁ దనకేలే
మగువకుచముల చెమట నంటిన యా-
పొగరుఁ బరిమళమె పూసీఁ గాక

చ. 2:

బెడిదపుఁ దురుమిదె పెట్టీనీతఁడు
తడవుగ నలరులు తనకేలే
పడఁతి శిరసునను ఫైఫైఁ జెరిగిన-
జడివాన విరులు జారీఁ గాక

చ. 3:

చిమ్ముచు వీడెము సేసీనీతఁడు
తమ్ములముమియఁడు తనకేలే
కొమ్మ వీడెమిఁక కోనేటప్పఁడు
తమ్మివదనమున దాఁచీఁ గాక