పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0075-6 శ్రీరాగం సం: 05-264

పల్లవి:

బిగ్గెఁ గాఁగలించుకోవే పిరితీయక
నిగ్గుల యాతనిమేను నేఁడే నొచ్చీనా

చ. 1:

మందరమెత్తినవాఁడు మల్లుల మొత్తినవాఁడు
అందపు నీ గుబ్బల వేఁగాన లేఁడా
గొందినున్న కుచములు కొనవాండ్లెతేను
చెందిన యాతనిమేను చిల్లులయ్యీనా

చ. 2:

భూమెల్ల మోఁచినవాఁడు పొడవు దాఁచినవాఁడు
భామ నీ మొలనూలు భారమనీనా
వోమక యాతనితోడి వుపరిసురతానకు
యేమని వేఁడుకొనిన యేల లోఁగేవే

చ. 3:

వేంకటనగమువాఁడు వెన్నెలమొగమువాఁడు
కింకల నీ చేఁతలకుఁ గిందుపడీనా
పంకజవదన నీకుఁ బాయలేక చెనకిన
కుంకుమగుబ్బల చెనకులకోపఁడా