పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0075-3 సామంతం సం: 05-261

పల్లవి:

చెలువపు సేఁతల శిన్నెకా పెద్ద
వలపువేదనల వాడీనయ్యో

చ. 1:

మొగమునకెగరెడి మొనవాఁడి గుబ్బల-
చిగురుఁబెదవులాఁడి శిన్నెకా
నిగినిగ మెరిచేటి నీలిమేనివానిఁ-
సొగసు చూచి వాని సొలశీనయ్యో

చ. 2:

మొగ్గల మొలకల మురిపెపుఁ గన్నుల-
శిగ్గుల చిరునవ్వు శిన్నెకా
ఉగ్గున రేపల్లె వుసురు గొనేటివాని
దగ్గరి తమకానఁ దడవీనయో

చ. 3:

చంకల బంగారు చల్లిన మెఱుఁగుల
చింకబెదరులాఁడి శిన్నెకా
వేంకటపతిఁ గూడి వేడుక తోడుత
సుంకుల సోగల సొలశీనయ్యో