పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0075-2 ఆహిరి సం: 05-260

పల్లవి:

మాననీఁడు పుంటినోవి మరఁది వీఁడే
నూనముపైఁ జేయి చాఁచీ మందవారిమరఁది

చ. 1:

మంచమెక్కి వావిచూచీ మరఁది వీఁడే
మంచినీటి చెలమల మరఁది
మంచు గుంచానఁ గొలిచే మరఁది వీఁడే
పించెపు శిరసు పాగ పిన్ననాఁటి మరఁది

చ. 2:

మంద మిరియాలు చల్లే మరఁది వీఁడే
మందు నూరీ మాటలనే మరఁది
మందుమాయసేఁతల మరఁది వీఁడే
కుందణపు వన్నెదట్టి కొంగు జారే మరఁది

చ. 3:

మక్కళించే వలపుల మరఁది వీఁడే
మక్కువ నాకౌఁగిట మరఁది
మక్కువలఁ గరఁగించే మరఁది వీఁడే
చిక్కె వేంకటాద్రిమీఁది చిన్ననాఁటి మరఁది