పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0075-1 ముఖారి సం: 05-259

పల్లవి:

చెప్పరాదీయింతి సిరులు - దీని -
వొప్పులిన్నియుఁ జూడ వొరపులోకాని

చ. 1:

ముదితజఘనముమీఁది మొలనూలిగంటలవి
కదలు రవమెట్లుండెఁ గంటిరే చెలులు
మదనుఁడుండెడి హేమమందిరము దిరిగిరాఁ
గదిసి మ్రోసెడి పారిఘంటలో కాని

చ. 2:

కొమ్మపయ్యెదలోని కుచమూలరుచి వెలికిఁ
జిమ్ముటది యెట్లుండెఁ జెప్పరే చెలులు
యిమ్మైన మరుధనములెల్ల రాసులు వోసి
కమ్ముకొని చెంగావి గప్పిరో కాని

చ. 3:

నెలతకంఠమునందు నీలమణిహరములు
అలరుటెట్లుండు కొనియాడరే చెలులు
లలితాంగి ప్రాణవల్లభుఁడు వేంకటవిభుఁడు
నెలకొన్న కౌఁగిటనె నిలిచెనో కాని