పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0073-6 శ్రీరాగం సం: 05-252

పల్లవి:

మామనునేతు మాగతవానసి
కాముకవిద్యాకల చలరే

చ. 1:

భిల్లవధూకుచపీడన కుతుకో-
త్ఫుల్లకరాంబుజ భూషణ
పల్లవ గోపక పరివృత శఠజన-
వల్లభ రతిపరవశ చలరే

చ. 2:

గోపీజన కుచకుంకుమ పంక వి-
లేపన మిళిత లలితదేహ
తాపకరణ సంతత బహువినయా-
లాప రూపమేళన చలరే

చ. 3:

పరవనితామణి పరతంత్రత్వాఁ
త్పరుష నఖాంకిత పతిరసికిమ్‌
కురవకభూరుహ కుంజగృహంతే
తిరువేంకటనగాధిప చలరే