పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0073-5 ఆహిరి సం: 05-251

పల్లవి:

వద్దు మమ్మింత నెవ్వగల వలయించ నిటు
పొద్దువొద్దునకు నోపుదుమా వోరి

చ. 1:

బీరమున నిన్ను వలపించుకొన నేమంత-
వారమా వట్టిగరువములు గాక
నేరుపే కలిగినను నీచేతలకు నింత
దూరుచును కాఁకఁ గందుదుమా వోరి

చ. 2:

కన్నులనె వలపు చిలుకఁగఁ జూడ నేమంత-
కున్నారమా నీవుదుటు గాక
వన్నెలను నిన్ను నేవలపింతునైన నీ-
వున్నవిధమిటు చూడనోర్తుమా వోరి

చ. 3:

నీ నేరములు దక్కె నీకు నినుఁ బాయఁగల-
నైన నేనిట్టవుదు నటరా
కోనేటిరాయ తక్కులుమాని మచ్చికల-
నూని నాకౌఁగిటనె వుండరా వోరి