పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0073-3 ఆహిరి సం: 05-249

పల్లవి:

కాల కడఁ దెగెఁ జెలియగర్వంపు దాలిములు
కాలగతి యిఁకనెంత గాఁగలదొ మీఁద

చ. 1:

బలుపుఁ దురుమరజాతి పగలుచీఁకట్లాయె
పొలయుఁగన్నీట నిప్పులు గురిసెను
చలితాపమున శశియు సవితుండుఁ గవఁబొడచె
ఇల మదనదైవికం బెటుగాఁ గలదొ

చ. 2:

చెడుగు నిట్టూరుపుల చిచ్చు గాలియుఁ గూడె
వెడగుఁ జెమటల జలధి వెల్లివిరిసె
కడుఁబులకలనె శిథిలి కన్నచోటనె పొడమె
సుడిసి చెలిసిగ్గెట్ల చూరఁబోఁగలదో

చ. 3:

భామకుచముల మీఁదఁ బ్రతిచందురులు వొడచె
చీమ దొంతర లతలఁ జిగిరించెను
వామాక్షి వేంకటేశ్వరుకౌఁగిటను గలసె
ప్రేమమిఁక నిదియెంత పెద్దగాఁగలదో