పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0073-2 శ్రీరాగం సం: 05-248

పల్లవి:

కొప్పుతావి సారెసారె కుప్పళించవలసి
అప్పటి నీ మారుమొగమయ్యేవాతనికి

చ. 1:

భారపు నీ గుబ్బల సంపద చూపవలసి
వోరగా నొరగుమీఁద నొరగేవు
తోరపు నీకన్నుల యేతులె చూపవలసి
సారెకు చూపులఁ బగచాటేవాతనిని

చ. 2:

తట్టెడి నీమట్టిలమోఁతలు చూపవలసి
పట్టఁబట్టఁ గానే పుష్పరిగెక్కేవు
వట్ట నీకొపాన చెలువము చూపవలసి
పెట్టినహరముల గుంపెనలఁ దీసేవు

చ. 3:

తొయ్యలి నీ మేని మృదువు చూపవలసి
కయ్యపు వేంకటపతిఁ గౌఁగిలించేవు
చయ్యననే నీ సరసము చూపవలసి
చయ్యాటములనె యిట్టె జంపులనేచేవు