పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రకు: 0073-1 శంకరాభరణం సం: 05-247

పల్లవి:

సారెకు నంటకురే జడనందురు
ధీరుఁడాతఁడున్నతపు దేహియట

చ. 1:

బాయిటఁ బెట్టకురే పక్షులు పారెడిపొద్దు
వోయమ్మ బాలులకు నొప్పదందురు
మాయపు బులుగొకటి మచ్చికనీబాలుని
చేయిచ్చి యెక్కించుకొనఁ జేరీనట

చ. 2:

పంచలఁ దిప్పకురే పాములు వెళ్ళేటి పొద్దు
కొంచెపుబాలులఁ బైకొనునందురు
మించిన పామొకటి మెరసి యీ బాలుని
దించక యొక్కించుకొనఁ దిరిగీనట

చ. 3:

అలమి పట్టకురే అంటఁ గాకుండెడివారు
తొలరమ్మ బాలులకు దోసమందురు
కలికి యీ తిరువేంకటపతిఁ గదిసిన
చెలఁగి వేగమే చీరచిక్కీనట