పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0004-7 శంకరాభరణం సం: 05-024

పల్లవి:

అలరులు గురియఁగ నాడెనదే
అలకలఁ గులుకుల నలమేల్‌ మంగ

చ. 1:

అరవిరి సొబగుల నతివలు మెచ్చఁగ
అరతెర మరఁగున నాడెనదే
వరుస పూర్వదువాళపు తిరుపుల
హరిఁగరగింపుచు నలమేల్‌ మంగ

చ. 2:

మట్టపు మలపుల మట్టెల కెలపుల
తట్టెడి నడపుల దాఁటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేల్‌ మంగ

చ. 3:

చిందుల పాటల శిరి పొలయాటల
అందెల మోఁతల నాడెనదే
కందువ తిరువేంకటపతి మెచ్చఁగ
అందపు తిరుపుల నలమేల్‌ మంగ