పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0071-5 ముఖారి సం: 05-239

పల్లవి:

ఎవ్వరు గలరీతనికిఁక నేమిటికిని వెరవకు మన-
నెవ్వరుగలరాత్మరక్ష యేప్రొద్దునుఁ జేయను

చ. 1:

పసిబాలకు బండివిరిగి పడి మేనెల్ల నొచ్చెను
కసుగందుకు నీరుపాముకాటున మై గందెను
నసికొట్లఁగోడెచేత నరుమాయను శిశువింతయు
వసముగాని చను ద్రావినవలనఁ బాపఁడు వాడెను

చ. 2:

పెనుమాఁకుల పైపాటున బెదరి వెరచెఁ బిన్నవాఁడు
ఘనమగు సుడిగాలి దాఁకి కనుమూయనోపఁడు
అనువున వేంకటగిరిపై నన్నిసంకటములుఁ బాసి
మునిజనముల గేహముననుండెడి దేవుఁడు