పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0071-4 సాళంగనాట సం: 05-238

పల్లవి:

తనువెల్లఁ గోమలము తలఁపు వెగ్గలమాయ
వనితభాగ్యము గంటివా తరుణి

చ. 1:

పోఁకలంతేసి ముత్యముల కంటసరులవి
వేఁకపు గుబ్బలమీఁద వేఁగుఁగాక మానునా
కాఁకల నడుము చిక్కెఁగదె గోరుచుట్టుపై
రోఁకటిపోటాయనమ్మరో తరుణి

చ. 2:

ముమ్మడించినట్టి పెద్దమొగపుల మొలనూలు
యిమ్మైన పిరుఁదుమీఁద నింతభారమేఁటికే
బొమ్మరపోయెడి నవ్వులఁ బూఁటకూటిమీఁదఁ
దమ్మ వుమియఁగాదా తరుణి

చ. 3:

సరసరూపవిలాసముల నింతికి నెందు
తిరువేంకటాచలాదిపుఁడెట్ల నిచ్చెనే
అరిదిబంగారునకు నపురూపమగుమణి
దొరకినట్లాయఁగాదో తరుణి