పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0071-2 శ్రీరాగం సం: 05-236

పల్లవి:

చంపరాని పగనంబు: చల్లగాలి వేఁడి చిగురు-
టంపకోల దాఁకి దేహమప్పుడెట్లనోర్చెనే

చ. 1:

పువ్వుటమ్మ దాఁకి చెలికిఁ బొక్కె మేను విభునిచూపు-
లివ్వలవలఁ గాఁడినప్పుడెట్లనోర్చెనే
జవ్వనంపు గుచభరము జడిసె నడుము కొప్పు వేఁగు
రవ్వదోఁప నడపుచేతి రాయిడెట్లనోర్చెనే

చ. 2:

తప్పకెపుడు నతనిఁ జూచి తనివివోని తరుణి నేఁ-
డిప్పుడింత దడవు వాసి యెట్లనోర్చెనే
నొప్పికించుకోర్వలేక నొసలఁబట్టు వెట్టుకాంత
దప్పిదేరునట్టి విరహతాపమెట్లనోర్చెనే

చ. 3:

ఇంచుకంత కప్పురమునఁ బారు తనువుమీఁద
నెంచరాని మదనరేఖలెట్లనోర్చెనే
మించి వేంకటాద్రివిభుఁడు మీఁదమీఁదనొరసి కూ
చరాని కంటసరులు వనిత యెట్లనోర్చెనే