పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0071-1 కాంబోది సం: 05-235

పల్లవి:

ఏల రాఁడమ్మ యింతిరో వాఁ-
డేల రాఁడమ్మ నన్నేలినవాఁడు

చ. 1:

పచ్చని పులుగుల బండిమీఁద నుండు-
పచ్చవింటి పిన్నబాలుని తండ్రి
పచ్చనిచాయలఁ బాయని బంగారు-
పచ్చడము గట్టి బాగైనవాఁడు

చ. 2:

తెల్లని పులుగుపైఁ దిరుగ మరిగినట్టి-
తెల్లని సతిపాలి దేవరతండ్రి
తెల్లని పరపుపైఁ దేలిపొరలు వెట్టు-
తెల్లని కన్నుల తెలివైనవాఁడు

చ. 3:

కొండవింటివాని గుత్తగొనిన యట్టి-
కొండుక పాయపుఁ గూఁతురుతండ్రి
కొండలరాయఁడు కోనేటి తిమ్మయ్య
కొండ తలనెత్తి గుఱుతైనవాఁడు