పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0069- 5 ధన్యాశి సం: 05-227

పల్లవి:

బండి విరిచి పిన్నపాపలతో నాడి
దుండగీఁడు వచ్చె దోబూచి

చ. 1:

పెరుగు వెన్నలుఁ బ్రియమున వే-
మరు ముచ్చిలించు మాయకాఁడు
వెరవున్నాఁ దనవిధము దాఁచుకొని
దొరదొంగ వచ్చె దోబూచి

చ. 2:

పడుచు గుబ్బెత పరపుపై పోక-
ముడి గొంగు నిద్రముంపునను
పడియుఁదా వద్దఁ బవళించినట్టి-
తొడుకుదొంగ చెచ్చె దోబూచి

చ. 3:

గొల్లపల్లెలో యిల్లిల్లూ చొచ్చి
కొల్లలాడిన కోడెకాఁడు
యెల్లయినా వేంకటేశుఁడు ఇదె
తొల్లటిదొంగ వచ్చె దోబూచి