పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0069-4 మాళవి సం: 05-226

పల్లవి:

చూడవమ్మ యశోదమ్మ
వాడల వాడల వరదలివిగో

చ. 1:

పొంచి పులివాలుఁ బెరుగు
మించు మించు మీఁగడలు
వంచి వారలుపట్టిన
కంచపుటుట్ల కాఁగులివిగో

చ. 2:

పేరీఁ బేరని నేతులు
చూరలు వెన్నల జున్నులును
ఆరగించి యట సగఁబాళ్ళు
పారవేసిన బానలివిగో

చ. 3:

తెల్లని కనుఁదీగెల సోగల
చల్లలమ్మేటి జవ్వనుల
చెల్లినట్లనే శ్రీవేంకటపతి
కొల్లలాడిన గురుతులివిగో