పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0069-3 శ్రీరాగం సం: 05-225

పల్లవి:

కవయఁగవలెనంటి కాఁగలించేవా నీ-
వువిదలఁ దలఁచకవుండనోసేవా

చ. 1:

పారిటాకులు గట్టి పారనోపేవా
యేరులెల్ల దాఁటి కొండలెక్కనోపేవా
యీరీతి వెదురుబియ్యమేరనోపేవా
పేరినతేనెలు తెచ్చి పెట్టనోపేవా

చ. 2:

యెడమఁ గుడిని వింటనేయనోపేవా
అడవిమెకాల వేఁటలాడనోపేవా
కడఁగి చెంచెత నాతోఁ గలశుండేవా
అడరి నాపొత్తుల నారగించేవా

చ. 3:

యిప్పటి మాఁటలు యీడేరించనోపేవా
చెప్పినట్టే కాఁపురము సేయనోపేవా
కప్పిరంపుశయ్యపై వేంకటరాయఁడా
యెప్పుడుఁ బాయని చనవియ్యనోపేవా