పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0068-4 మంగళకౌశిక సం: 05-220

పల్లవి:

అబ్బురంపు శిశువు ఆకుమీఁదిశిశువు
దొబ్బుడు రోలశిశువు త్ర్పువి త్ర్పువి త్ర్పువి

చ. 1:

పుట్టు శంఖుచక్రములఁ బుట్టిన యాశిశువు
పుట్టక తోల్లే మారుపుట్టువైన శిశువు
వొట్టుపక పాలువెన్నలు నోలలాడు శిశువు
తొట్టెలలోని శిశువు త్ర్పువి త్ర్పువి త్ర్పువి

చ. 2:

నిండిన బండి దన్నిన చిన్నిశిశువు
అండవారి మదమెల్ల నణఁచిన శిశువు
కొడలంతేశసురులఁ గొట్టిన యా శిశువు
దుండగంపు శిశువు త్ర్పువి త్ర్పువి త్ర్పువి

చ. 3:

వేఁగైన వేంకటగిరి వెలసిన శిశువు
కౌఁగిటి యిందిరా దొలఁగని శిశువు
ఆఁగి పాలజలధిలో నందమైన పెనుఁబాము
తూఁగుమంచము శిశువు త్ర్పువి త్ర్పువి త్ర్పువి