పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0068-5 ముఖారి సం: 05-221

పల్లవి:

పలుకుఁదేనియల నుపారమియ్యవే
అలరువాసనల నీ యధరబింబానకు

చ. 1:

పుక్కిటి లేనగవు పొంగుఁబాలు చూపవే
చక్కని నీవదనంపు చందమామకు
అక్కరొ నీవాలుఁగన్నులా రతిగా నెత్తవే
గక్కన నీచెక్కుతొలుకరి మెరుపులకు

చ. 2:

కమ్మని నీమేని తావి కానుకగా నియ్యవే
వుమ్మగింత చల్లెడి నీవూరుపులకు
చిమ్ముల నీచెమటలఁ జేయవే మజ్జనము
దిమ్మరి నీమురిపెవు తీగమేనికి

చ. 3:

పతి వేంకటేశుఁ గూడి పరవశమియ్యవే
యితవైన నీమంచి హృదయానకు
అతనినే తలఁచఁగ నానతియ్యఁ గదవె
తతితోడ నీలోని తలపోఁతలకు