పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0068-2 భైరవి సం: 05-218

పల్లవి:

ఏమీననకురే యెప్పుడు మీరు
గామిడియై కాలిసన్నఁ గదలీని బిడ్డఁడు

చ. 1:

పొలసీననకురే పొదిగి యిందరుఁగూఁడి
వులికి తలదీసుకవున్న బాలుని
పలుకఁడనకురే బలుమోరతోపుఁ గోపి
తలఁకి సిబ్బితిగొని తలరమ్మ బిడ్డఁడు

చ. 2:

అడిగీననకురే ఆసదీరదనకురే
కడఁగి చలమరియై గాసిఁబెట్టీని
జడలున్న వనకురే జననుతుఁడీశిశువు
కడు దూరీ గిరులకు గమనించి బిడ్డఁడు

చ. 3:

బిత్తలున్నాఁడనకురే పృథివిలోఁ బిన్నవాఁడు
మత్తులై వున్నవారి మడియించీని
చిత్తిణివాఁడనకురే శ్రీ వేంకటేశుఁడు
యెత్తుక యీరేడులోకాలేలీని బిడ్డఁడు