పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0068-1 శంకరాభరణం సం: 05-217

పల్లవి:

వేఁటకాఁడనంటా నా వెంటఁ బాయవు వోరి
చీటకపు చెంచెత నాచేతిలాగెరఁ గవా

చ. 1:

పొదలో నేనేసిన పులి నీవేసితినని
పెదపెద్ద యెలుగుఁల బెదరించేవు
కుదురుగుబ్బల నిన్నుఁ గుమ్ముదునో వుండేవో మేను
చిదియఁగా మేటిచెంచెత నన్నెఱఁగవా

చ. 2:

చేరువ నామోఁటునఁ జేరిన నామెకముల
నేరుపరినంటా నీవునేసేవు
జీరలుగా కొమ్ము గోరఁ జింతుతో వూరకుండేవో
పేరుకల చెంచెత నాబిరుదులెరఁగవా

చ. 3:

చొల్లెపు చుట్టలతోడ చూపులకు నడ్డాలు
చెల్లునంటా వచ్చి చెట్టవట్టేవు
నొల్లననఁగా గూడేవు వుద్దండపు వేంకటేశ
జల్లివింటి చెంచెత నాచలములెరఁగవా