పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0065-3 శ్రీరాగం సం: 05-201

పల్లవి:

వనితలఁ గరఁగించు వన్నెకాఁడపు యిట్టె
తనివి దీరవేమిటఁ దగునయ్య విట్ఠల

చ. 1:

ఫైపైనె యేరమణిగుబ్బలతో యిచ్చితివి నీ-
వైపైన కరముల వాఁడిగోళ్ళు
దూపిలిన రతితోడఁ దోయఁ డు చేతులతోడ
యేపుననున్నాఁడవిపుడేమయ్య విట్ఠల

చ. 2:

పొందైన యేలలన చూపులకొ యిచ్చితివి నీ-
విందైన మురిపెపు వేయిగన్నులు
అందపు రెండుగన్నులరవిరి నీ మోమున
చెందమ్మి రేకులఁ బోలుఁ జెల్లునయ్య విట్ఠల

చ. 3:

కింకల నేసతికో చిక్కెను నీచిత్తమెల్లను
అంకెల నన్ను నేలితివబ్బురంబుగా
పంకంపుఁ గస్తూరిమేన పండరంగిపతివైన-
వేంకటనగముమీఁది వెడమాయ విట్ఠల