పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0065-2 సామంతం సం: 05-200

పల్లవి:

కడు నీకు మోహించుఁగాని చక్కనివిభు-
నెడసి నిమిషమైన నెట్టోరిచేవే

చ. 1:

పసిఁడిమంచముమీఁదఁ బవళించి యతనితో
కసరులాడెడియట్టు గాదువో నేఁడు
విసిగించెఁ గదనె యీ విరహానలము నిన్ను-
నిసుమంత దడవైన నెట్లోరిచేవే

చ. 2:

అడుగులొత్తుచు నీ యడుగులు నతనియై
కడఁగి వొత్తినయట్లు గాదువో నేఁడు
బడలించెఁ గదవె యీ పరితాపమున నిన్ను-
నెడయెడ యలుకలనెట్టోరిచేవే

చ. 3:

ఒరపైన యతినిపై నొరగి యాతనిమతిఁ
గరఁగించునటువలెఁ గాదువో నేఁడు
వెరవక కలసితి వేంకటపతితోడ-
నెఱిఁగెఱుంగని చేఁతలెట్టోరిచేవే