పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0064-5 ఆహిరి సం: 05-197

పల్లవి:

బయలీఁ దించేవే గొల్లపడుచా- నీవె
బయలీఁదించేవు లోపలనె కన్నులను

చ. 1:

పాలు వోయవుగా గొల్లపడుచా-యీ-
పాలుకుండలివి లోలోపల నున్నవి
పాలుమాలేవేలే గొల్ల పడుచా- మా-
పాలు నీ కేలయ్య పాలవారివాఁడవు

చ. 2:

పచ్చితేనె దేవే గొల్లపడుచ- మాకు
పచ్చితేనె లేదు మావిపంటనే కాని
పచ్చిమాటలేలే గొల్లపడుచ- పూవుఁ-
బచ్చితేనెలివివో నీ పలుకుల కొనలు

చ. 3:

పసిచల్లమ్మే గొల్లపడుచా- నీవె
పసివడి తిరిగేవు బడివాయక
పసిబాలవటె గొల్లపడుచా- కురుఁ-
బల వేంకటగిరిపతి నన్నేలితివి