పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0064-4 శ్రీరాగం సం: 05-196

పల్లవి:

ఎనలేని బీరములెండ మావులు
ఇనుపగుగ్గిళ్ళు నీవేమిసేసేవే

చ. 1:

పల్లదపుఁ గోరికల బలిమి గలుగఁబట్టి
తల్లడపు దమకము దక్కెఁగాక
వెల్లిగొను మమతపై విసిగేవు యీ-
యిల్లులేని ముంగిలి నీవేమి సేసేవే

చ. 2:

లేఁత నీచిత్తములోఁ దాలిమి గలుగఁగఁ బట్టి
చేఁతల నీయలుకెల్లఁ జెల్లఁగాక
పూఁతమాఁటల సొలపుబొంకులనె దూరేవు
యీఁతలేని చల్లులాట యేమిసేసేవే

చ. 3:

నెరతనముల నీ నెయ్యము గలుగఁబట్టి
తొరలి వేంకటపతి దొరకెఁగాక
తెరవ నీకితనికిఁ దియ్యపుఁ గూటముల
యెరుకలేనిమఱపులేమి సేసేవే