పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0063-6 వరాళి సం: 05-192

పల్లవి:

కొలిచి బిందెలఁ దోసుకొనుఁగాక యీఁ
మలయుఁగోరికలనెడి మాడలే పండె

చ. 1:

పొలఁతి సిగ్గులపోడు వొడిచి చిత్తపుటడవి
తొలుచూపు బదనుననె దున్నఁగాను
తలపోఁత విత్తఁగా తను చెమటవానలనె
బలువైన తమకమను బంగారు పండె

చ. 2:

ఇచ్చకపుఁ జిరునగవులింటిలోపలి తోఁట
మచ్చుఁజీఁకట్లె పలుమరుఁ దవ్వఁగా
ఎచ్చుకుందుల సొలపులేతపుజలము వారి
నచ్చుఁగాఁకల పైఁడినక్కులే పండె

చ. 3:

తగిలి వేంకటవిభుని తనివోని కౌఁగిటను
జగడంపుఁ గూర్మి సరసము చల్లఁగా
నిగనిగని పలుకుఁదేనియలు వేమఱుఁ బారి
నిగుడు విరహగ్ని మాణికములే పండె