పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0063-4 నారణి దేశాక్షి. సం: 05-190

పల్లవి:

ఎందరికి మెహించి యెందువోతివో నీ-
యందపు జేఁతలు నాతో నానతియ్యరాదా

చ. 1:

పాదమున నంటిన పచ్చకప్పురములోన
వేదుగాఁ దులసితావి విసరీని
యేదెసఁ బవ్వళించితి వెవ్వతె పాదములొత్తె-
నాదరముతోడ నాతో నానతియ్యరాదా

చ. 2:

చెలువంపు నొల నించిన పచ్చి కస్తూరి
తులసి పరిమళము దొలఁకీని
యెలమి నెక్కడకేఁగి యెవ్వతెకు మొక్కితివో
అలవి దేరఁగ నాతో నానతియ్యరాదా

చ. 3:

ఉరము నీ మాణికాన వొనరిన జవ్వాది
సరిగాఁ దులసితావి చల్లీని
తిరువేంకటేశ పొందితివి నన్నిదె నీ-
యరవిరి విధమైన నానతియ్యరాదా