పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0063-1 ముఖారి సం: 05-187

పల్లవి:

పైపై దూరక పదరో యింతి
కోపాన బాసైనఁ గొనీఁ గాని

చ. 1:

పరివారపుఁ బడఁతులేఁటికే
దొరలనంటేరు తొలరో
సరసపు తమ జగడాల నిట్టే
పరుల దూరేరు పచ్చిగనే

చ. 2:

చక్కని విభుని సారెకుఁ జెలులు
వెక్కసాలాడక విడరో
దిక్కులకెల్లాను తెఱవఁ బాసి తాఁ
నొక్కఁడే విచ్చేయుటొచ్చెమని

చ. 3:

శ్రీ వేంకటేశుఁడు చెలువుఁ డొక్కఁడే
యేవంకకేఁగిన నేమౌను
భావించి యురముపనున్న కొమ్మదాఁ
నేవేవి గడించె నెఱుఁగరా