పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0062-6 బౌళి సం: 05-186

పల్లవి:

పెట్టని కోటిందరికిఁ బెండ్లికొడుకు బొమ్మ-
బెట్టె నసురలకెల్ల- బెండ్లికొడుకు

చ. 1:

పెల్లగించి భూమెత్తీఁ బెండ్లికొడుకు వాఁడె
పిల్లఁగోవి రాగాల పెండ్లికొడుకు
పెల్లైన యీవుల పెండ్లికొడుకు వాఁడె
పిల్లఁదీపుపెన్నుద్ది పెండ్లికొడుకు

చ. 2:

పెంచెపు శిరసుపాగ పెండ్లికొడుకు గుం-
పించిన కోపగించీఁ బెండ్లికొడుకు
పెంచకప్పుడే పెరిగెఁ బెండ్లికొడుకు వల-
పించెఁ జక్కనిసిరిఁ బెండ్లికొడుకు

చ. 3:

పెంట పెరుగులదొంగ పెండ్లికొడుకు భూమిఁ
బెంటి పోతులఁ గూరిచెఁ బెండ్లికొడుకు
గెంటులేని వేంకటగిరిమీఁదను వాఁడె
పెంట వెట్టుకున్నవాఁడు పెండ్లికొడుకు