పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0061-5 శుద్దవసంతం సం: 05-180

పల్లవి:

ఎన్ని సేసినా నీకు నిది గొత్తలా
అన్నిటిలోపల నుండే అతఁడౌదో కావో

చ. 1:

వొలఁతి మొయిఁదీగెపై పులకలు వొడమించే-
విల నిన్నుఁ దలఁపించి యిది గొత్తలా
తలకొన్న వేణునాదముననె వట్టిమాఁకు-
లలర- జేసినవాఁడవౌదువో కావో

చ. 2:

గుట్టునఁ బయ్యెదకొంగు గుబ్బలనె జారించే-
విట్టె నీ ప్రేమనే యిఁతికిది గొత్తలా
మట్టుకొని వేణురవమున గొల్లెతల చీర-
లట్టు నిట్టు వదలించి నాతఁడౌదో కావో

చ. 3:

కాంత కవుఁగిటను వేంకటగిరి విభుఁడా నీ-
వింత మేను మఱపించుటిది గొత్తలా
పంతమూడి యడవిలో పసుల నీరాగాల-
రంతులనే మఱపించే రాజవవుదో కావో