పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0061-4 దేసాళం సం: 05-179

పల్లవి:

నెయ్యములల్లోనేరేళ్ళో
వొయ్యన వూరెడి వువ్విళ్ళో

చ. 1:

పలచని చెమటల బాహుమూలముల-
చెలమలలోనాఁ జెలుపములే
థళథళమను ముత్యపు జెఱఁగు సురటి
దులిపేటి నీళ్ళతుంపిళ్ళో

చ. 2:

తొటతొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ
చిటి పొటి యలుకల చిరునగవే
వటఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకలలోనా గుక్కిళ్ళో

చ. 3:

గరగరికల వేంకటపతి కౌఁగిట
పరిమళములలో బచ్చనలు
మరునివింటి కమ్మనియంప విరుల-
గురితాఁకులినుపగుగ్గిళ్ళో