పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0061-4 శ్రీరాగం సం: 05-178

పల్లవి:

వేవేగన రానివిభునితోడి పొందు
యేవూరికేవూరు యేవూరే

చ. 1:

ప్రేమమెఱిఁగి రాఁడు పలిచిన పతితోడ
యేమందమేమందమేమందమే
భామిని తను నొవ్వఁబలికెనననుచు నాడె
యేవమాఁటకేమాఁట యిది యేఁటికే

చ. 2:

జామాయ నిదె వచ్చి సటలెల్లఁ బచరించి
యేమేలుకేమేలు ఇదియేఁటికే
కామునిశరములఁ గాఁగునింతకుఁ జెలి
యేమిటికింక మనమేమిటికే

చ. 3:

దిమ్మరితనములఁ దిరువేంకటేశుని
రమ్మను రమ్మను రమ్మనవే
నెమ్మనమలరఁగ నేఁడింతలోననే
కమ్మరఁ గమ్మరఁ గరుణించెనే