పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0061-2 ముఖారి సం: 05-176

పల్లవి:

ఎవ్వఁడో వీఁడేల తంగి వచ్చి
నవ్వీ నవ్వీ నాతోనే

చ. 1:

పచ్చిపాలే పచ్చిపాలే
పచ్చిపాలే తోడంటుఁబాలే
వచ్చి వచ్చి వాడ వాడలఁ
జొచ్చియారగించెఁ జూడరే

చ. 2:

పెంట పెరుగే పెంట పెరుగే
పెంటమంద పెనుఁబెంట పెరుగే
అంటకంటకు మనఁగానే వాఁడు
వొంటి నారగించీ నోయమ్మా

చ. 3:

బొంకుగోరో బొంకుగోరో
బొంకుగోరో కోరో పాలఁతులు
వేంకటేశుండు వేసాలరాయఁడు
అంకెలా నన్ను నలరించెనే