పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0061-1 కొండమలహరి సం: 05-175

పల్లవి:

భోగీంద్రశయనుని బోయతి దివ్య-
భోగాలు మరిగిన బోయతి

చ. 1:

పొదిగొన్న పెనుఁగొప్పు బోయతి మించుఁ-
బొదలిన గుబ్బల బోయతి
పొదలఁ బూవులు చూచి బోయతి యంప-
పొది సవి వెరచెనె బోయతి

చ. 2:

పొడల గందపుమేని బోయతి పచ్చి-
పొడికప్పురపు బూఁత బోయతి
పొడవైన హరిఁ జూచి బోయతి నేఁడు
పుడుకు వేఁదురుగొన్న బోయతి

చ. 3:

పొందైన రచనల బోయతి పతిఁ
బొందక పొందిన బోయతి
పొందులెరఁగని బోయతి రతిఁ
బొందె వేంకటపతి బోయతి