పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0030-4 పాడి సం: 05-170

పల్లవి:

చింతల చిగురులె చిచ్చులట
యింతటిలోనిఁక నేలాగే

చ. 1:

చక్కని మన్మథ సంవత్సరంబున
చుక్కలరాజే సూరియుఁడై
యెక్కువరాత్రుల యెండగాయునట
యెక్కడిదిఁక బ్రదుకేలాగే

చ. 2:

కాంతల నడుములఁ గఱవయ్యెడినట
అంతట జవ్వనపామనిని
వింత మీన సని వెలఁదులకన్నుల -
నెంత గనమౌనొ యేలాగే

చ. 3:

కంకుమగుబ్బల కుంభరాశికిని
వంకల చంద్రుఁడు వచ్చెనట
వేంకటరమణుఁడు వెలఁదిఁ గూడెనట
యింక నీ తమక మేలాగే