పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0030-3 సామంతం సం: 05-169

పల్లవి:

తలనొక్కమాటాడఁ దలకెక్కె వలపు దీని-
తలఁపు రేఁచక మీరు తలరమ్మా

చ. 1:

చిత్తజు నమ్ములు దాఁకి జీర వారినందుకు పూ-
వత్తులు వేయక కాని వాడదమ్మా
బత్తిగల వారిందరు పచ్చకప్పురము మేన
మెత్తకకాని మానదు మెత్తరమ్మా

చ. 2:

కంటిచూపు కాయజుని వింటిబాణములు దాఁకి
గంటిలేని పోటులాయఁ గదరమ్మా
అంట ముట్టరాని తాప మగ్గలమైనది ముల్లు
ముంటఁగాని పోదు మేను మూయరమ్మా

చ. 3:

అప్పుడింత సొబగు లేదతివమొగమునందు
చొప్పులెల్ల బాగులాయ చూడరమ్మా
అప్పుడు శేషాద్రిరాయఁడంగన గలిసెఁ గాన
యెప్పుడూఁ బాయని చనవిచ్చె నమ్మా