పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0030-2 సామంతం సం: 05-168

పల్లవి:

సారెసారె విన్నవించఁ జాలమిఁక నీవు
దారిదప్ప దిరిగేవు తగవా వోరి

చ. 1:

చెప్పరాదు కడు వలచిన వానివలె నా-
కొప్పులోని సవరము కొంటఁబోయి
అప్పుడే వొక్కతికిచ్చితట వోరి నా-
తప్పుగాని నీవల్లఁ దప్పులేదు వోరి

చ. 2:

కడలేని మోహంబు గలవానివలె నా-
కడితాను చీర నీవు కాసెవోసి
వడిగా నేఁగెదవు యవ్వతికియ్యవలెనో నన్ను
వడిఁబెట్టి యింతసేయవలెనా వోరి

చ. 3:

ముద్దుల నా వేలనున్న ముద్దుటుంగరము నీవు
వుద్దండానఁ గొంటఁబోతి వోరి
తిద్దలేము నీగుణాలు తిరువేంకటేశ నీవు
వొద్దికతో నన్నుఁబాయకుండరా వోరి