పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0003-5 కాంబోది సం: 05-016

పల్లవి:

పొద్దు వొద్దుకును వలపుల నేఁచేవు వద్దు
బుద్దిగాదు నీకు నేఁప భువనమోహినిని

చ. 1:

అప్పుడు మా విన్నపము లాలకించఁ బొద్దులేక
యిప్పుడు విచ్చేసినాఁడవిఁక నైనాను
చెప్పరాని విన్నియును చిత్తగించి చూతు గాని
చప్పర మంచములోని చక్కని కోమలిని

చ. 2:

అలసి మాతోడ మాటలానతియ్య వేళగాక
యెలయించ వచ్చినాఁడ వింతలోననే
సొలపు మాటలు గావు చూడు నీవే మేడమీఁద
చెలులపైనొరగిని జిగి గుబ్బలాఁడిని

చ. 3:

వేఁగెడి రమణిఁ జూచి వేగినంతకు రావైతి
మాఁగెఁగా యింతట నీ మనసైనాను
వేఁగు వచ్చెనా నీకు వేంకటేశ కృపఁజూడు
కాఁగిట నవధరించు కన్నుల కలికిని