పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0003-6 ముఖారి సం: 05-017

పల్లవి:

ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి
యిదిగాక వైభవంబిఁక నొకటి కలదా

చ. 1:

అతివ జన్మము సఫలమై పరమయోగివలె-
నితర మోహపేక్షలిన్నియును విడిచె
సతికోరికలు మహశాంతమై యిదె చూడ
సతత విజ్ఞాన వాసనవోలె నుండె

చ. 2:

తరుణి హృదయము కృతార్ధతఁ బొంది విభుమీఁది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనోజయమంది యింతలో
సరిలేక మనసు నిశ్చల భావమాయ

చ. 3:

శ్రీవేంకటేశ్వరుని జింతించి పరతత్వ-
భావంబు నిజముగా బట్టెఁ జెలియాత్మ
దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు
లావణ్యవతికి నుల్లంబు దిరమాయ