పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0003-4 భైరవి సం: 05-015

పల్లవి:

సిన్న వాఁడవని నమ్మ సెల్లదు నిన్ను
సిన్నైన యాటదెల్ల సిక్కుసీరై పోయను

చ. 1:

అవుర బాలకిసునరాయఁడ నీవు సంటిపాలు
నవులంటా నెత్తురెల్ల సప్పరించఁగా
కవకవ నవ్వినవ్వి కన్నులు దేలగిలఁగ
సవరన్ని యాటదెల్ల నప్పుసారై పోయను

చ. 2:

రారా గోపాలకిసునరాయ నీవదె గొల్ల-
వారి మగువల సూపు వల్లె వేయఁగా
సూరఁబోయే రేపల్లె సొక్కని గుబ్బెతల-
సేరలంతల కన్నుల సిన్ని సిన్ని సిగ్గులు

చ. 3:

కిన్నెర వెంకటగిరి కిసునరాయఁడ నీవు
వన్నెలుగ వీది వీది వాయించఁగా
మిన్నుదాఁకి లోకానకు మేఁటియైన లకిమమ్మ
నిన్ను సేరి సరుగన నిలుసుండే సొక్కెను