పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0003-3 రామక్రియ సం: 05-014

పల్లవి:

రాగఁదే చూతఁడిదె రసికుఁడగు కెలవాడిఁ
కౌఁగిటి రమణితోడ కనకగిరి వాని

చ. 1:

అదిగదె వసంతంబులాడీఁ గూడి
కదలుఁగనుఁ గవల చక్కని సతులతో
వెదకి పై కుంకుములు వేసీ రాసి
వుదుటుచనుదోయిపై నొదిగి వొదిగి

చ. 2:

కడుఁ బేర్చి నేతికడవల గుబ్బెతలఁ జేరి
అడుగడుగునకు నాటలాడి
నడిమి సన్నపుసిరుల నగవు రెప్పల గరుల
తొడికి చెనకీనదివొ దొరదైవము

చ. 3:

దప్పి దేరంగ సైఁదపుగుడుములును వడలుఁ
బప్పులునుఁ బన్నీటి పానకములు
అప్పఁడగు కెలవాడి అదె కనకరాయఁడై
కప్పురము చల్లి చక్కని సతులపైని