పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0003-2 సామంతం సం: 05-013

పల్లవి:

ఎట్టు వోరిచెనో కాని యింత దడవు- అప్పు-
డట్టు నిట్టుఁ దల్లడించె నతఁడంతలోననే

చ. 1:

అంటఁగాక వున్నదానవని యెఱుగక యాతఁ-
డింటికిట్టె రాఁగా నీవు నెదురువోయి
వొంటకున్నరీతి దవ్వులనున్న నినుఁ జూచి
అంటఁజేరి చిన్వఁబోయె నతఁడంతలోననే

చ. 2:

వేడుక నాతఁడు రాఁగా వెనకవెనకకుఁ బోయి
తోడనే సిగ్గును నవ్వుఁ దొలఁకఁగాను
వీడి వీడని కొప్పు విసరుచుఁ దలయూఁచ-
నాడనే మూర్చవోయె నతఁడంత లోననే

చ. 3:

చయ్యనఁ బన్నీటి మజ్జనమాడి నీవు నేఁడు
ఉయ్యాలమంచముమీఁద నుండఁగాను
నెయ్యపు వేంకటపతి నినుఁగూడి పరవశ-
మయ్యీనబ్బురముగ నతఁడంతలోననే