పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0028-6 దేశాక్షి సం: 05-161

పల్లవి:

ఒడయఁడవు నినుఁబాసి యుండవశమా తరుణి
చిడుముడియలుక చేతిచిలుకఁ బగచేసె

చ. 1:

గారవపు జలరాశికన్య నీతోనలిగి
ఆరామములలోన నలయఁగాను
వైరంపుబాణమై వనజమిరుమై గాఁడె
ఈ రీతి నీ యలుక యిల్లు పగఁజేసె

చ. 2:

ఎలజవ్వనిటు నీకు నెదురుచూచుచు వెడలి
చెలఁగి వెన్నెలకు విచ్చేయఁగాను
నలువొందఁ జంద్రకిరణములు మయివడిఁ బొక్కె
బులుపుఁ గోపము తోడఁబుట్టుఁ బగచేసె

చ. 3:

పంతంపు శ్రీసతికిఁ బతివి వేంకటరమణ
కాంతహృదయంబెఱిఁగి కలయఁగాను
అంతలోననె మదనుఁడలయించె నిప్పుడిటు
కొంతవడి నీకసరు కొడుకుఁ బగచేసె