పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0028-4 ఆహిరి సం: 05-159

పల్లవి:

వేడుక నెవ్వతెరా విడుపక నిన్నంటి
వాడుదేరే వలపుల వన్నెలు వెట్టనది

చ. 1:

గద్దరి యెవ్వతెరా నీ గారవంపు చెక్కున
నిద్దంపు చంద్రరేఖ నిలిపినది
అద్దిరా దానిగయ్యాళితనమెట్టిదో
ముద్దుఁదనమోహము నీ మోహమున రాచినది

చ. 2:

దిట్టైన యది యెవ్వతెర నీ యధరమందు
కొట్టఁగొన మరుచిలుకులొత్తినది
గట్టిగఁ జూడర దానిగబ్బితనమెట్టిదో తన-
గుట్టెల్ల నీకు నాకున వ్రాసెంపినది

చ. 3:

చక్కనిదెవ్వతెర నీ సరిలేని మేనఁ దన-
మిక్కుటంపు మేనితావి మేళవించినది
అక్కరగాఁ దిరువేంకటాధీశ కూడితివి
మక్కువతో నీకు పరిమళములంపినది