పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0028-3 కన్నడగౌళ సం: 05-158

పల్లవి:

వంచన ప్రియములవారే కాక
నించిన కన్నీటి నేనేల నీకు

చ. 1:

గిలుకు మట్టెలతోడ కిందిచూపులతోడ
సెలవి నవ్వులు నీ పైఁ జిందఁగాను
వలతువుగాక యెవ్వతి కైనఁ జిత్తము
నిలుపఁగనోపని నేనేల నీకు

చ. 2:

గోడచాట్లతోడ కోనచీఁకటితోడ
వాడల నెలయించువారేకాక
వాడుచు లేమావి వడచల్ల వెడమాయ-
నీడలనెండే నేనేల నీకు

చ. 3:

జగడంబులతోడ సణగు సొలపుతోడ
వగ నిన్ను భ్రమయించువారె కాక
దిగులులేక నిన్ను తిరువేంకటేశుఁడ
నెగులెఱుఁగక కూడు నేనేల నీకు