పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0025-4 కాంబోది సం: 05-141

పల్లవి:

ఒయ్యనె దగ్గరరమ్మ పూడిగాల సతులు
అయ్యో విసరరమ్మ అలశున్నవాఁడు

చ. 1:

కరఁగు-జెమటలతో గందపుఁ బేంట్లతోడ
ఒరగి పవ్వళించున్నాఁడొ త్తగిల్లి
సరసపు మాటలతో చాఁచిన పాదములతో
గురియైన సతులతో గోవిందరాజు

చ. 1:

తెల్లని కన్నులతోడ తేనెగారు మోవితోడ
చెల్లుబడిఁ బవ్వళించీ శేషునిమీఁద
వెల్లిగొను వూర్పులతో వెన్నెల నవ్వులతోడ
కొల్లవలపులతోడ గోవిందరాజు

చ. 3:

బొడ్డు పూఁపకొడుకుతో పుక్కిటి తమ్ములముతో -
నొడ్డిన రతులతోడ నోలలాడీని
వెడ్డు వెట్టి కూడెనిదె వేంకటేశుఁడింతులను
గొడ్డువోని వరముల గోవిందరాజు