పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0025-3 నాట సం: 05-140

పల్లవి:

చిత్తము నిజమైనఁ జేరు నేపనులైన
బత్తి సౌఖ్యమునకుఁ బ్రాణము

చ. 1:

కన్నుల కలికికిఁ గలిగెఁబో కడ-
కన్నులమీఁది బింకపు నవ్వు
చిన్నిచెక్కులమీఁది చెమటలు -మేన-
నన్నువ మురిపెపుటలపులు

చ. 2:

తోయజగంధికి దొరకెఁబో మన -
మాయ నియతితోడి మఱపులు
సోయగమగు మోము సొబగులు- కడు-
రాయిడి చనుదోయి రచనలు

చ. 3:

లావణ్యమతి మీఁద లాసెఁబో
శ్రీ వేంకటేశుని చెలుములు
తావి చల్లెడి కమ్మఁదనములు - పాసి-
పోవని విభుతోడి పొందులు