పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0025-2 మలహరి సం: 05-139

పల్లవి:

ఎందరి దూరుదమిందరుఁ గూడుక
సందడివలుపులఁ జంపేరే

చ. 1:

కంటఁ బుట్టినవాఁడు కమలముఖులకడ-
కంటఁ బుట్టినవాఁడు గవగూడి
జంట వాసినఁ జంపుదుమని లేని-
వెంటలు గడియించి వేఁచేరే

చ. 2:

ఏఁటఁ బుట్టెడివాఁడు నేడు దెరువులై
వూఁటాడెడివాఁడు నొనగూడి
మాఁటమాఁటాకు మాయపు మనసులు
తీఁటలు రేఁచుక తిరిగేరే

చ. 3:

కొండలరాయఁడు కోనేటి తిమ్మయ్య
వుండినచోట నేనుండఁగా
పండిన మోహము బాధలఁ జిత్తము
మెండైన వేడుక మెచ్చీనే