పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0023-4 పాడి సం: 05-129

పల్లవి:

ఒఱపో మెఱుపో వొయ్యారమో నీకు
వెఱతుమయ్య గోవిందుఁడా

చ. 1:

కపటమో నిజమో కరుణ కోపమో
వుపచారవమో వుపతాపమో
నిపుణత తనపై నెయ్యమే సేసేవు
విపరీతము గోవిందుఁడా

చ. 2:

ననుపో నగవో నయమో ప్రియమో
చనవో చలమో సరసమో
కనుకూరిమియో గయ్యాళితనమొ
వెనుతగిలేవు గోవిందుఁడా

చ. 3:

మంకో మరులో మదమో ముదమో
జంకో లంకో జగడమో
శంకలేక నను సరుగనఁ గూడితి
వేంకటగిరి గోవిందుఁడా